From the first article పలుకుబడి: ముందుమాట:
"సంస్కృత భాషా పదాల వ్యుత్పత్తి గురించి, వాటికి మిగిలిన ఇండో-యూరోపియన్ భాషా పదాలతో గల సంబంధం గురించి గత మూడు వందల యేళ్ళలో ఎంతగానో పరిశోధనలు జరిగాయి. ఆ భాషా పరిశోధనలతో పోలిస్తే, ద్రావిడ భాషలలో భాషా పరిశోధన చాలా వెనుకబడి ఉందనే చెప్పాలి. అందుకే, ఈ శీర్షికలో ఎక్కువగా తెలుగు పదాల వ్యుత్పత్తిని, వాటికి సోదర భాషలైన తమిళ, కన్నడ భాషలలో సజాతి పదాల గురించి, వాటి ప్రయోగాల గురించి నాకు తెలిసినంతలో రాయాలని నా ప్రయత్నం. ఈ యత్నంలో విజ్ఞులైన పాఠకుల అభిప్రాయాలు, సలహాల ద్వారా నేనూ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాననే ఆశతోనే ఈ శీర్షిక నడిపే సాహసం చేస్తున్నాను.
వచ్చే విడతలో ‘వ్యుత్పత్తి’, ‘నిరుక్తి’, ‘పలుకు’, ‘బడి’, ‘పలుకుబడి’, ‘నుడి’, ‘నుడికారము’, ‘మాట’ మొదలైన పదాల వ్యుత్పత్తి గురించి చర్చిద్దాం."
Tuesday, March 08, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment