Thursday, June 21, 2012

An old Telugu song for my birthday


Lyrics
        


ఓ... ఓ... చిగురాకులలో చిలకమ్మా

చిన్నమాట వినరావమ్మా

ఓ... ఓ...మరుమల్లెలలో మావయ్యా

మంచి మాట సెలవీవయ్య



పున్నమి వెన్నెల గిలిగింతలకు

పూచిన మల్లెల మురిపాలు

నీ చిరునవ్వుకు సరికావమ్మ ... ఓ...

ఓ... ఓ... చిగురాకులలో చిలకమ్మా



ఎవరన్నారు ఈ మాట ... వింటున్నాను నీ నోట

తెలిసీ పలికిన విలువేనా... ఆ...

ఓ... ఓ... మరుమల్లెలలో మావయ్యా



వలచే కోమలి వయ్యారాలకు

తలచే మనసుల తియ్యదనాలకు

కలవా విలువలు సెలవీయ ... ఓ...

ఓ... ఓ... చిగురాకులలో చిలకమ్మా



పై మెరుగులకే భ్రమపడకయ్య

మనసే మాయని సొగసయ్య

గుణమే తరుగని ధనమయ్యా



ఓ... ఓ... మరుమల్లెలలో మావయ్యా

మంచి మాట సెలవీవయ్య

ఓ... ఓ... చిగురాకులలో చిలకమ్మా

చిన్న మాట వినరావమ్మా


from http://raji-oldisgoldsongs.blogspot.com.au/2012/05/blog-post_11.html

No comments: