Thursday, December 30, 2010

నాకు నచ్చిన ఒక తెలుగు సినిమా పాట

నాకు నచ్చిన ఒక తెలుగు సినిమా పాట. ఇది 'పెంకిపెళ్ళాం' నుంచి. ఆరుద్ర రచన. పాడింది ఎవరో తెలియదు. జిక్కి బృందమేమో. ఇది మామూలు సైట్లలో దొరకలేదు. నాదగ్గర టేపులో కొంచెం అరిగిపోయినది ఉంది. కొన్నాళ్ళ వరకు ఎవరూ వెబ్లో పెట్టకపోతే, ఎక్కడైనా పెట్తాను. వెతుకుతుంటే ఒక బృందం పాడినది దొరికింది. అసలు పాట ఇంకా చాలా బాగుంటుంది.
Paduchudanam Railubandi (Telugu).flv
A 1947 Hindi song on which it may have been modeled:
SHEHNAI - JAWANI KI RAIL CHALI JAYE RE
Lyrics in Telugu:
పడుచుదనం రైలు బండి పోతున్నది
వయసు వాళ్ళ కందులోన చోటున్నది
విరహాల నిట్టూర్పుల రాక్షసి బొగ్గు
ఇంజను తాగే నీరు తొలకని సిగ్గు
కష్టాల స్తేషన్ లో బండి ఆగదు
బండిలోన విచారాన్ని యుగళబారదు
కుర్రకారు పిల్లవాళ్ళు రాకూడదు
ముసలివాళ్ళు పిసినిగొట్లు రామాళదు
ఇక్కట్టులు లేకుండుట టిక్కెటండి
చక్కగ నవ్వేవాళ్ళే బండి ఎక్కండి

P.S.'యుగళబారదు '
పూర్వం దక్షినాది రైళ్ళలో చాలభాషలలో ప్రజలను హెచ్చరించేవారు. ఇది కన్నడంలో 'ఉమ్మివేయగూడదు ' అని భరాగో గారు చెప్పారు.
P.P.S. రామాళదు అంటే.. రావద్దు అని అర్ధం. ఈ..పదం వాడుకని నేను నెల్లూరు జిల్లాలో
విన్నాను. నెల్లూరు, చిత్తూరు, మాండలికం .. (from http://groups.google.com/group/telugupadam/browse_thread/thread/18e9fd7b7c6a3fee?hl=te)
P.S. It is available here http://www.muzigle.com/album/penkipellam
or here

No comments: