From [తెలుగుపదం] తెలుగులో క్తాంతాలు - చరిత్ర, కల్పన:
"అచ్చతెలుగులో కూడా ఇలాంటి నిర్మాణాలు చెయ్యడానికి అవకాశం ఉందని కొన్ని పదాల ద్వారా తెలుస్తోంది. కానీ అలాంటి నిర్మాణాల సూత్రీకరణకి సాంప్రదాయిక తెలుగు వ్యాకరణాల్లో స్థానమివ్వడం జఱగలేదు. కారణం - ఒకటి, ఈ అవకాశం ఉన్నట్లు మన పూర్వీకులు గ్రహించక పోవడం. గ్రహించక పోవడానికి కారణం - ఆ పదాల మార్గంలో నూతనపదాల కల్పన అప్పటికే స్తంభించిపోయి ఉండడం. సంస్కృతం నుంచి అన్ని పదాల్నీ యథాతథంగా దిగుమతి చేసుకోవడానికి అలవాటుపడి ఉండడం. రెండోది, మన పూర్వుల్లో అధికసంఖ్యాకులు వల్లమాలిన సంస్కృతాభిమానం చేత అంధీకృతులు. ఈ పిచ్చి అభిమానం మాతృభాషని ఇతోఽధికంగా పరిశోధించడానికి అప్పట్లో ఒక పెద్ద మానసిక ఆటంకం (mental barrier) గా మారింది. ఆ శోధించిన కొద్దిపాటి భాషని కూడా సంస్కృత పద్ధతుల్లోనే శోధించడానికి మొగ్గుచూపారు. తెలుగుని ఒక ప్రత్యేక వ్యక్తిత్వం ఉన్న భాషగా వారు పరిగణించలేదు. తెలుగుభాషకే సొంతమైన, విలక్షణమైన అనేక విషయాలు సంస్కృత వైయాకరణ పరిభాషతో వివరించడానికి సాధ్యం కాకపోవడంతో అవి అపరిష్కృతంగా, అసూత్రీకృతంగా మిగిలిపోయాయి. తత్ఫలితంగా ఆంధ్రభాషాభూషణం ఒక్కటి మినహాయిస్తే అహోబలపండితీయము మొ||న మన ప్రాచీన వ్యాకరణాలు సైతం సంస్కృతంలోనే సంస్కృత పద్ధతుల్లో వ్రాయబడ్డాయి."
Sunday, November 29, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment