Friday, August 19, 2011

Nadireyi ye Jamulo (నడిరేయి ఏ జాములో)

on YouTube here
lyrics from here (which has lyrics of many other Telugu songs)
నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగి వచ్చునో
తిరుమల శిఖరాలు దిగి వచ్చునో(నడిరేయి)
మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ(2)
పతిదేవు ఒడిలోన మురిసేటివేళ
స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా

ఏడేడు శిఖరాల నే నడువలేను
ఏపాటి కానుకలందించలేను
వెంకన్న పాదాలు దర్శించలేను
నేను వివరించి న బాధ వినిపించలేను
అమ్మా....ఆ...ఆ..ఆ..
మముగన్న మాయమ్మ
అలివేలుమంగా....ఆ...ఆ...
మముగన్న మాయమ్మ
అలివేలుమంగా(విభునికి)

కలవారినేగాని కరుణించలేడా
నిరుపేద మొరలేవి వినిపించుకోడా
కన్నీటి బ్రతుకుల కనలేని నాడు
స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మా
అడగవే మా తల్లీ అనురగవల్లీ
అడగవే మాయమ్మ అలివేలు మంగా(నడిరేయి)
P.S. From this artucle by Rihiniprasad http://www.pranahita.org/2009/06/music01_cinema_patallo_vayidyalu/ it appears thar Chittibabu played veena for this song.

No comments: